అడుగులు కన్వర్షన్

మీకు కావలసిన మెట్రిక్ కన్వర్టర్ కొరకు సర్చ్ బాక్స్ ను వాడండి

అడుగులు

  • ’ (ఆరంభ గుర్తు)
  • (పది అడుగులు అనేది 10 అ లేదా 10 గా సూచించవచ్చు)
  • యొక్క యూనిట్:

    • పొడవు / దూరము

    ప్రపంచవ్యాప్తంగా వాడకం:

    • ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్ లో అధికారిక యూనిట్ గా వాడబడుతోంది. కెనెడా కూడా అడుగును ఒక ప్రత్యామ్నాయ కొలమానంగా గుర్తించింది (ప్రామాణిక మెట్రిక్ కు), మరియు అడుగు అనేది యునైటెడ్ కింగ్ డమ్ లో సాధారణంగా ఉపయోగించబడుతోంది.
    • అడుగు అనేది ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమలో ఉన్నతాంశాన్ని కొలవడానికి కూడా ఉపయోగిస్తారు.

    వివరణ:

    అడుగు అనేది సామ్రాజ్య మరియు యు.ఎస్. కస్టమరీ కొలమాన పద్ధతులలో గజము లో 1/3 వవంతుగా సూచించబడే పొడవు యొక్క ఒక యూనిట్, మరియు అది పన్నెండు అంగుళాలుగా విభజించబడి ఉంటుంది.

    నిర్వచనం:

    1959 లో అంతర్జాతీయ గజము మరియు పౌండు ఒప్పందం (యునైటెడ్ స్టేట్స్ మరియు కామన్ వెల్త్ ఆఫ్ నేషన్స్ యొక్క దేశాల మధ్య), ఒక గజాన్ని 0.9144 మీటర్లకు ఖచ్చితంగా నిర్వచించబడింది, దీనితో ఒక అడుగు అనేది 0.3048 మీటర్లగా (304.8 మిమీ) ఖచ్చితంగా నిర్వచించబడింది.

    మూలము:

    అడుగు అనేదానిని ఎంతో నమోదుచేయబడిన చరిత్ర అంతటా కొలమానం యొక్క యూనిట్ గా ఉపయోగించబడింది - దీనిలో పురాతన గ్రీసు మరియు రోమ సామ్రాజ్యం కూడా ఉన్నాయి - మరియు పేరు యొక్క మూలం సాధారణంగా ఒక పురుష వయోజనుని పాదం (లేక షూ)  పరిమాణానికి సంబంధించి ఆమోదించబడింది, వాస్తవంగా పదహారు విడిభాగ యూనిట్లుగా విభజించబడి, రోమన్స్ కూడా అడుగును పన్నెండి ఉన్సియా - ఇది ఆధునిక ఆంగ్ల పదం ఇంచ్ కు మూలం గా విభజించారు.

    అడుగు అనేది జాతీయ మరియు ప్రాంతీయ తేడాలు సాధారణమైనా కూడా యూరోప్ అంతటా గత రెండువేల సంవత్సరాల పాటు వాడబడుతోంది. అడుగు అనే పదం ఎక్కడ (మరియు ఎప్పుడు) వాడబడుతోందనేదానిపై ఆధారపడి, దానిని పొడవులుగా అతిచిన్నదిగా 273 మిమీ లేదా అతిపెద్దదిగా 357 మిమీగా సూచించవచ్చు. అడుగు అనేది ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లభాష మాట్లాడు దేశాలలో కూడా సాధారణంగా వాడబడుతోంది.

    ప్రాన్స్ తో ప్రారంభించి 18 వ శతాబ్దపు చివరలో, చాలా దేశాలు మెట్రిక్ పద్ధతిని స్వీకరించడంతో అడుగు వాడకం నిరాకరించబడింది, 

    సాధారణ ఉల్లేఖనాలు:

    • ఒక అసోసియేషన్ ఫుట్ బాల్ (సాకర్) గోల్ అనేది ఎనిమిది అడుగుల ఎత్తు, ఎనిమిది గజాల (24 అ) వెడల్పు కలిగి ఉంటుంది.
    • "ఆరు అడుగుల నేల" అనేది సమాధిలో పూడ్చిపెట్టడానికి వాడు ఒక మృదువైన వాక్యము, లేదా మరింత విస్తృతంగా ఒక మరణించిన వ్యక్తిని "ఆరు అడుగుల నేల" అని కొన్ని సార్లు వివరిస్తారు.
    • "ఐదు అడగుల ఎత్తు మరియు పెరగడం" (వరద నీటికి ఒక సూచన) అనేది జానీ క్యాష్ ద్వారా ఒక పాట శీర్షిక లాగా వాడబడింది. డీ లా సోల్ , ఆతరువాత వారి 1989 హిట్ హిప్ హాప్ ఆల్బమ్ కు "3 అడుగుల ఎత్తు మరియు పెరగడం" శీర్షికగా ఉంచుకున్నారు.

    వాడక విషయము:

    1995 లో యుకె లో అంగుళము, గజము మరియు మైలు తో పాటుగా అడుగు అనేవి, రహదారి సంకేతాలు మరియు సంబంధిత దూరాన్ని మరియు వేగాన్ని కొలిచే ప్రాథమిక యూనిట్లుగా అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఇతర సందర్భాలలో మెట్రిక్ కొలతలు అనేవి ఇప్పుడు ప్రాథమిక వ్యవస్థ, అయినా అడుగులు అనేవి ఇంకనూ తరచుగా లాంఛనా పద్ధతుల ఆధారంగా ఉపయోగించబడుచున్నాయి, ఇవి ప్రత్యేకంగా పూర్వ-దశాంశ బ్రిటన్ లో జన్మించి, విద్యనభ్యసించిన వారి ద్వారా ఉపయోగించబడుచున్నాయి.

    అడుగు అనేది ఎఫ్ పిఎస్ వ్యవస్థలో ఒక మూల యూనిట్ గా కూడా ఉపయోగించబడుతోంది, ఇది అడుగులు, పౌండ్లు మరియు సెకెండ్లను, కొలత యొక్క ఇతర యూనిట్లయిన పౌండల్ (అ*పౌం-మీ*సె-2), శక్తి కొరకు ఒక యూనిట్ కొలత వంటి వాటిని గ్రహించుటకు ఉపయోగించబడుతుంది.

    కాంపోనెంట్ యూనిట్లు:

    • 12 అంగుళాలు = 1 అడుగు

    గుణాంకాలు:

    • 3 అడుగులు = 1 గ (గజం)