ఫారన్ హీట్ కన్వర్షన్

మీకు కావలసిన మెట్రిక్ కన్వర్టర్ కొరకు సర్చ్ బాక్స్ ను వాడండి

ఫారన్ హీట్

  • యొక్క యూనిట్:

    • ఉష్ణోగ్రత

    ప్రపంచవ్యాప్తంగా వాడకం:

    • 20 శతాబ్దం మధ్య నుండి చివరికాలంలో చాలా దేశాలలో ఫారన్ హీట్ స్కేల్ బదులుగాసెల్సియస్  వాడబడింది, అయినా, యునైటెడ్ స్టేట్స్, కేమాన్ ఐలాండ్స్ మరియు బెలిజె లో ఫారన్ హీట్ అనేది అధికారిక స్కేల్ గా నే ఉండిపోయింది.
    • కెనడాలో సెల్సియస్ తో పాటుగా ఫారన్ హీట్ ను అనుబంధంగా వాడుతున్నారు మరియు యుకె లో ఫారన్ హీట్ స్కేల్ ను, ప్రత్యేకంగా వేడి వాతావరణాన్ని వ్యక్తీకరించుటకు లాంఛన ప్రాయంగా ఉపయోగించబడుతోంది (చల్లని వాతావరణం సాధారణంగా సెల్సియస్ స్కేల్ లోనే వ్యక్తీకరించబడుతోంది)

    నిర్వచనం:

    ఫారన్ హీట్ అనేది ఒక ఉష్ణగతిక ఉష్ణోగ్రతా స్కేలు, దీనిలో నీటియొక్క ఘనీభవన పాయింట్ 32 డిగ్రీల ఫారన్ హీట్ (°F) గానూ మరియు మరుగు పాయింట్  212°F గానూ (ప్రామాణిక వాతావరణ ఒత్తిడివద్ద) ఉంటుంది. ఇది నీటి యొక్క మరుగు మరియు గడ్డకట్టు పాయింట్లను ఖచ్చితంగా 180 డిగ్రీల తేడాలో ఉంచుతుంది. అందుచేత, ఫారన్ హీట్ స్కేల్ పై ఒక డిగ్రీ అనేది నీటి యొక్క గడ్డకట్టు పాయింట్ మరియు మరుగు పాయింట్ మధ్య గల అంతరం యొక్క 1/180

    మూలము:

    జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, డేనియల్ గేబ్రియల్ ఫారన్ హీట్ (1686-1736)  1724 లో ప్రతిపాదించబడి పేరుపెట్టబడింది. ఫారన్ హీట్ గారు పాదరసాన్ని ఉపయోగించి ధర్మామీటర్లను తయారుచేయడంలో అగ్రగామిగా వెలుగొందారు మరియు 0°F ను ఒక ప్రామాణిక ఉష్ణోగ్రతగా ఏర్పరచారు, అది ఐస్, నీరు, మరియు ఉప్పులను సమాన పరిమాణాలలో కలిపినపుడు జరుగుతుంది. అతను, ఆ తరువాత 96°F ను "ఒక జీవమున్న మానవుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు థర్మామీటర్ నోటితో పట్టుకున్నప్పుడు లేక చంక క్రింద ఉంచుకున్నప్పుడు" కనబడే ఉష్ణోగ్రతగా నిర్వచించాడు. 

    తరువాత, నీటి యొక్క గడ్డకట్టు ఉష్ణోగ్రత అనేది ఖచ్చితంగా 32°F గా  మరియు సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత  98.6°F గా పునర్నిర్వచించబడింది,

    సాధారణ ఉల్లేఖనాలు:

    • సంపూర్ణ సున్నా, -459.67°F
    • నీరు గడ్డకట్టు పాయింట్, 32°F
    • ఉష్ణ వాతావరణంలోని వెచ్చని వేసవి రోజు, 72°F
    • సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత, 98.6°F
    • 1 వాతావరణం వద్ద నీటి యొక్క మరుగు పాయింట్, 212°F