ఘన అడుగులు కన్వర్షన్

మీకు కావలసిన మెట్రిక్ కన్వర్టర్ కొరకు సర్చ్ బాక్స్ ను వాడండి

ఘన అడుగులు

  • ఘనపుటడుగు/అడుగులకు విశ్వజనీయ అంగీకార గుర్తేదీ లేదు.
  • ఘనపు అ, ఘ అ, ఘన అ, ఘన అడు, అ3, అడుగు3, అడు3 వాటితో సహా సందర్భాన్ని బట్టి, అనేక రకాల పొట్టిరూపాలు ఉపయోగించబడతాయి.
  • యొక్క యూనిట్:

    • పరిమాణము (ఒక మూడు కొలతల స్థలాన్ని లెక్కించడం)

    ప్రపంచవ్యాప్తంగా వాడకం:

    • ఘనపు అడుగు అనేది ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్, కెనెడా మరియు యునైటెడ్ కింగ్‌డమ్ లో వాల్యూమ్ యొక్క కొలమానంగా ఉపయోగిస్తారు

    వివరణ:

    ఘనపుటడుగు అనేది సామ్రాజ్య మరియు యు.ఎస్. కస్టమరీ కొలమాన పద్ధతులలో ఉపయోగించు వాల్యూమ్ యొక్క ఒక యూనిట్

    ఒక ఘనపుటడుగు అనేది ఇవ్వబడిన పదార్థం యొక్క వాల్యూమ్ ను లేదా అలాంటి పదార్థాన్ని ఉంచుకోగల ఒక పాత్ర యొక్క సామర్థ్యాన్ని వివరించుటకు ఉపయోగించవచ్చు.

    నిర్వచనం:

    ఒక ఘనపు కొలత అనేది ఒక రేఖా కొలమానం యొక్క మూడు-కొలతల గ్రాహ్యము, కాబట్టి ఒక ఘనపుటడుగు అనేది 1 అ పొడవుతో ఉన్న ఒక ఘనం యొక్క వాల్యూమ్ గా నిర్వచించబడింది.

    మెట్రిక్ పదాలలో, ఒక ఘనపుటడుగు అనేది 0.3048 మీటర్ల పొడవున్న భుజాలతో ఒక ఘనము. ఒక ఘనపుటడుగు అనేది సుమారుగా 0.02831685 ఘనపు మీటర్లు లేక 28.3169 లీటర్లలకు సమానం.

    సాధారణ ఉల్లేఖనాలు:

    •  ఒక ప్రామాణిక (20 అ x 8ఆ x 8 అ 6 అం) షిప్పింగ్ కంటెయినర్, 1.360 ఘనపుటడుగు యొక్క వాల్యూమ్ ను కలిగి ఉంటుంది
    • 19-22 ఘనపుటడుగు అనేది నలుగురు గల కుటుంబం కొరకు ఒక సరాసరి సైజు గల రిఫ్రిజిరేటర్ ను వివరిస్తుంది.

    వాడక విషయము:

    ప్రామాణిక ఘనపుటడుగు (ఎస్ సిఎఫ్) అనేది నిర్వచించబడిన పరిస్థితులక్రింద వాయువు యొక్క ఒక పరిమాణము (కీలకంగా 60 °F వద్ద మరియు 1 atm ఒత్తిడి వద్ద).

    నిర్వచించబడిన పరిస్తితుల క్రింద ఒక ప్రత్యేక నిర్ధిష్ట పదార్థాలకు వర్తించి నప్పుడు, ఘనపుటడుగు అనేది వాల్యూమ్ యొక్క యూనిట్ గా విరమించబడుతుంది మరియు పరిమాణం యొక్క యూనిట్ అవుతుంది.

    ఘనపుటడుగు తరచుగా రిఫ్రిజిరేటర్ల వంటి గృహోపకరణ వస్తువుల యొక్క స్టోరేజ్ సామర్థ్యం వివరించుటకు మరియు షిప్పింగ్ కంటెయినర్స్ కొరకు పరిశ్రమలలో వాడబడుతుంది.

    వాణిజ్య స్టోరేజ్ అందించువారు సాధారణంగా వారు అందించు స్టోరేజ్ యూనిట్లను ఘనపుటడుగులలో వివరిస్తారు.

    ఇవ్వబడిన ఒక వస్తువు లేదా స్థలం యొక్క వాల్యూమ్ ను ఘనపుటడుగులలో లెక్కించడానికి, దాని పొడవు, వెడల్పు మరియు ఎత్తులను అడుగులలో కొలిచి, వాటన్నింటినీ గుణించాలి.

    ఉదాహరణకు, ఒక స్టోరేజి యూనిట్ 10 అ పొడవు, 6 అ వెడల్పు మరియు 8 అ ఎత్తు ఉంటే, అది 480 ఘనపుటడుగుల సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరించవచ్చు (10 x 6 x 8 = 480).

    కాంపోనెంట్ యూనిట్లు:

    • ఒక ఘనపుటడుగు అనేది 1,728 ఘనపు అంగుళాలకు సమానం (ఒక అడుగు అంటే పన్నెండు అంగుళాలు కాబట్టి, ఒక ఘటపుటడుగును, పన్నెండు అంగుళాల భుజాలతో ఉన్న ఒక ఘనాన్ని ఊహించుకోవచ్చు లేదా 12 x 12 x 12 ఒక అంగుళం ఘనాలన్నింటినీ కలపవచ్చు) 
    • అభ్యాసంలో, ఘనపుటడుగు మరియు ఘన అంగుళాలు అనేవి విభిన్నమైన యూనిట్లు మరియు అవిరెండూ కలిపి ఉపయోగించబడవు.

    గుణాంకాలు:

    • 1 చదరపు గజము = 27 చదరపు అడుగులు
    • ఒక గజము అంటే మూడు అడుగులు, కాబట్టి ఒక ఘన గజమును మూడు అడుగుల భుజాలతో ఉన్న ఒక ఘనముగా లేక ఒక అడుగు పొడవున్న భుజాల 27 ఘనాలతో కూడిన ఒక ఘనముగా ఊహించుకోవచ్చు.
    • అభ్యాసంలో, ఘనపుటడుగు యొక్క గుణాంకాలను (ఆయిల్ మరియు గ్యాస్ పరిశ్రమలలో లాగా) ఎంసిఎఫ్ (వెయ్యి ఘనపుటడుగులు), ఎంఎంసిఎఫ్ (మిలియన్ ఘనపుటడుగులు), బిసిఎఫ్ (బిలియన్ ఘనపుటడుగులు) గా టిసిఎఫ్ మరియు క్యుసిఎఫ్ లను వరుసగా ట్రిలియన్ మరియు క్వాడ్రిలియన్ ఘనపుటడుగులుగా వివరించవచ్చు.